Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు-11మంది అరెస్ట్

Advertiesment
kids

సెల్వి

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (09:38 IST)
హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు అయ్యింది. ఈ ఘటనలో నలుగురిని రక్షించారు. 11మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టయిన వారిలో కోలా కృష్ణవేణి, బట్టు దీప్తి, గౌతం సావిత్రి, బట్టు శ్రవణ్ కుమార్, అంగోత్ శారద, బూడిద సంపత్ కుమార్, ఓగుటి నాగ వెంకట పవన్ భగవాన్, ఓగుటి రామ శ్రావణి, తెప్పల వినయ్ కుమార్, తెప్పల స్వాతి, లింగాల రమేష్ ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కృష్ణవేణి గుజరాత్‌లోని వందన అనే ప్రాంతం నుండి శిశువులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలు లేని జంటలకు ఏజెంట్ల గొలుసు ద్వారా అమ్ముతున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు.
 
కృష్ణవేణి వందనకు ఆడపిల్లకు రూ.1.5 లక్షలు, మగపిల్లవాడికి రూ.2.5 లక్షలు చెల్లిస్తోంది. దీప్తి, సావిత్రి ద్వారా ఆ శిశువులను నగరానికి తరలించారు. తర్వాత వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఎక్కువ ధరకు శిశువులను అమ్ముతున్నారు. రాచకొండ పోలీసులు మంగళవారం నాడు 11 మందిని అరెస్టు చేయడంతో అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు.  
 
ఇటీవల, కృష్ణవేణి ఇద్దరు ఆడ, ఇద్దరు మగ శిశువులను ఏర్పాటు చేసి వేర్వేరు కుటుంబాలకు విక్రయించారని రాచకొండ పోలీస్ కమిషనర్ సి సుధీర్ బాబు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన వందన కోసం పోలీసులు వెతుకుతున్నారు. వందన పట్టుబడిన తర్వాత శిశువులను దొంగిలించి హైదరాబాద్‌కు తరలించారా లేదా వారి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అమ్మేశారా అనేది స్పష్టమవుతుందని రాచకొండ సీపీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు యేడాదికి రెండుసార్లు!