Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తె స్నేహితురాలితో తండ్రి అక్రమ సంబంధం.. పెళ్లి ఖరారు కావడంతో...

Advertiesment
Chennai
, గురువారం, 26 డిశెంబరు 2019 (10:14 IST)
తన కుమార్తె స్నేహితురాలితో ఓ కామాంధుడు వివాహేతర సంబంధం కుదుర్చుకున్నాడు. వారిద్దరూ కలిసి భార్యాభర్తల్లో పలు ప్రాంతాల్లో వివాహ యాత్రలకు వెళ్లారు. అయితే, ఆ యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో జీర్ణించుకోలేని కామాంధుడు.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో తన జీవితం నాశనమైందని భావించిన బాధిత యువతి.. అతన్ని కత్తితో పొడిచి చంపేసింది. ఈ దారుణం చెన్నై నగరంలోని తిరువొట్రియూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూత్తుక్కుడి జిల్లాకు చెందిన అమ్మన్ శేఖర్ (54) అనే వ్యక్తి కర్పూరం హోల్ సేల్ వ్యాపారం చేస్తూ, చెన్నై నగరంలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అయితే, కుమార్తెను చూసేందుకు ఆమె స్నేహితురాలు పవిత్ర (25) తరచూ ఇంటికి వచ్చివెళ్లేది. ఆమెపై కన్నేసిన శేఖర్... బహుమతులిచ్చి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పవిత్రతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అలా కొన్ని నెలల పాటు కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో పవిత్రకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మన్ శేఖర్, గతంలో తాను తీసి దాచుకున్న అశ్లీల వీడియోలను ఆమెకు చూపించి, బెదిరింపులకు దిగాడు. దీంతో పవిత్ర కుంగిపోయింది. పైగా, అతనితో కలిసి తిరిగడం వల్ల తన జీవితం నాశనమైందని భావించి, శేఖర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అతన్ని కలిసి, బయటకు తీసుకెళ్లింది. బీసెంట్ నగర్, హార్బర్ క్వార్టర్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో తిరిగి, నిర్మానుష్య ప్రదేశాన్ని చూసుకుని, వాహనాన్ని ఆపమని కోరింది. ఓ బహుమతిని ఇస్తానని, కళ్లుమూసుకోవాలని పవిత్ర కోరగా, అమ్మన్ శేఖర్ కళ్లు మూసుకున్నాడు. 
 
ఆ వెంటనే తనతో తెచ్చుకున్న మత్తుమందు స్ప్రేను ముఖంపై చల్లి, కత్తితో గొంతుపై బలంగా పొడిచి పారిపోయింది. అప్పటికే స్పృహ తప్పిన అమ్మన్ శేఖర్, కాసేపట్లోనే ఘటనా స్థలిలోనే మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పవిత్రను అరెస్ట్ చేయగా, ఆమెను ఉరి తీయాలని అమ్మన్ శేఖర్ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి అలెర్ట్ : ప్రతి ఇంటికి పోలీసు నోటీసులు.. కొత్తవారు కనిపించారంటే..