పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాదనను కేంద్ర జల్‌శక్తి శాఖ బలపరిచింది. పోలవరం భూసేకరణ, పునరావాసానికే రూ.33,168 కోట్లు అవసరం అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకు విడుదల చేసింది కేవలం రూ.6,583 కోట్లే. ఇందులో ఇంకా విడుదల కావాల్సింది రూ.26,585 కోట్లు ఉన్నాయి. 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లకు అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ సవరించింది. దాన్ని రూ.47,725.87 కోట్లకు ఆర్‌సీసీ కుదించింది.
ఈ దశలో పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్నీ బలపరుస్తూ 2020–21 వార్షిక నివేదికలో కేంద్రానికి జల్‌శక్తి శాఖ
స్పష్టం చేసింది. సీఎం వైఎస్ జగన్ వాదనను బలపరుస్తూ ఆ శాఖ నివేదిక వెలువరించింది. ఇది జగన్ ప్రభుత్వానికి నైతిక బలం చేకూరుస్తుంది అని చెపుతున్నారు.