Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో గంజాయి కలకలం- 125 గ్రాముల గంజాయి పట్టివేత

cannabis
, శనివారం, 25 మార్చి 2023 (15:26 IST)
cannabis
తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతోంది. లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు లభించాయి. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం బయటపడింది.
 
ఈ ఘటనపై పవిత్రమైన తిరుమల కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తోందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోంది అనడానికి ఇదో సాక్ష్యం. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీఫక్కిలో దొంగతనం.. గోల్డ్ షాపు తాళాలు పగలకొట్టకుండా..?