Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీపీఎస్సీ పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం రద్దు

ఏపీపీఎస్సీ పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం రద్దు
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (05:14 IST)
ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, అవినీతి రహిత విధానాలకోసం పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి  వైయస్‌. జగన్‌ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాలను రద్దుచేయాలని నిర్ణయించారు.

రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడిలో అవినీతి, అక్రమాలపై ఆరోపణలు ప్రతి సందర్భంలో వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

అలాగే జారీచేస్తున్న నోటిషికేషన్లు కూడా న్యాయపరమైన వివాదాలకు దారితీస్తున్నాయని వెల్లడించారు. దీనిపై కూలంకషంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చించారు. అవినీతికి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలన్నారు.

ఇంటర్వ్యూ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని అక్కడికక్కడే ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం ఉండదు. ప్రతి  ఏటా జనవరి 1న ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయనున్న ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్‌ విడుదల చేయాలని ఆదేశించారు.

ఈ భర్తీలో అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో మరింత విశ్వసనీయత పెంచడానికి ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం, భాగస్వామ్యాలను తీసుకునే ఆలోచన కూడా చేయాలని, ఆమేరకు తగిన విధివిధానాలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నవంబర్‌ మూడోవారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించనున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను తయారు చేస్తారు. నవంబర్‌ నెలాఖరులోగా వీటిలో భర్తీచేయాల్సిన పోస్టులు, బడ్జెట్‌ కేటాయింపులు తదితర పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో మరోసారి సమావేశం అవుతారు.

అన్ని సన్నాహాలు పూరై్తన తర్వాత జనవరి 1, 2020న ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ను విడుదలచేయనున్నారు. సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ప్రసారాల నిలిపివేతలో మాకు సంబంధం లేదు : పేర్ని నాని