Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో రైళ్లకు బాంబు బెదిరింపులు.. 2 గంటల పాటు ఆలస్యంగా రైళ్లు

rail
, బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:06 IST)
ఏపీలోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రైళ్లలో  బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఫోన్‌ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది.
 
ఈ మేరకు ఓ ఆగంతకుడు డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆగంతుకుడి ఫోన్‌ కాల్‌తో ఈ మార్గంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేటలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ట్రైన్, చర్లపల్లి వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆపి తనిఖీలు చేపట్టారు.
 
మొత్తం రైలు బోగీల్లోని అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను జాగిలాలతో తనిఖీ చేశారు. కానీ బాంబుకు సంబంధించి ఆనవాళ్లు లేకపోవడంతో రైళ్లను పంపేశారు. ఈ క్రమంలోనే బెదిరింపును పోలీసులు ఫేక్‌కాల్‌గా తేల్చారు. 
 
మరోవైపు బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తనిఖీల కారణంగా రెండు రైళ్లూ సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...