Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందు నీ సంగతి చూసుకో.. విజయసాయిపై బీజేపీ నేతల మాటల దాడి

Advertiesment
BJP leaders
, గురువారం, 9 జులై 2020 (19:41 IST)
వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై బీజేపీ నేతలు తీవ్రమైన మాటల ఎదురు దాడి చేశారు. బీజేపీపై వైసీపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా కౌంటర్లిస్తున్నారు.

మీడియా, సోషల్ మీడియా వేదికగా వరుస వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘బీజేపీ విషయాలు పట్టించుకోవడం మానేసి మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి.

ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరితే ఆరుద్రలు.. బీజేపీలో చేరితే మిడతలా?. అయినా తినడం గురించి మీ కన్నా బాగా ఎవరికి తెలుసు’ అని బీజేపీ నేత విజయసాయిపై సత్యకుమార్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
 
బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. "రాష్ట్ర బీజేపీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా చేసిన అనుచిత వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
 
బిజెపి పార్టీ పై ఇంతకంటే ఎగిరెగిరి పడిన ప్రాంతీయ పార్టీలను దేశంలో చాలానే చూసిందన్న విషయాన్ని వైసిపి గుర్తు పెట్టుకోంటేమంచిది.
 
ఆ పార్టీలన్నీ నేడు ఢిల్లీలో ఉన్న మోడీ నుంచి ఫోన్ కోసం, అపాయింట్మెంట్ కోసం, బిజెపి నేతల పలకరింపు కోసం, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి.

రాష్ట్రంలో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు ఆడుతున్న రాజకీయ డ్రామ ప్రజలు గుర్తిస్తున్నారు.
 
 వైయస్ ఆర్ పార్టీలో నాయకత్వం పైన తిరుగుబాటు ధోరణిని, ప్రజల ఆలోచనను మరియు దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్న నాటకమని స్పష్టంగా అర్థమవుతోంది.

మీ రాజకీయ విమర్శలు బిజెపి నేతల మీద గాని, పార్టీ మీదకాని, చేసేముందు మీది ఓక ప్రాంతీయపార్టీ అనే విషయాన్నిమరిచిపోతున్నారు.

వైసీపీ పార్టీ యొక్క ఎంపీలు ,ఎమ్మెల్యేల వ్యాఖ్యలు అది మీ పార్టీ రాజకీయ వాపు లేద బలుపా అనే విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారు.
 
ఆంధ్రాలో బిజెపి ప్రతిపక్ష పార్టీగా మీరు గుర్తించినట్లు మీ భయం మరియు విమర్శలను బట్టి స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది.
 
నేడు ఆంధ్రప్రదేశ్ లో మీ వైఫల్యాలు అయినటువంటి ఇసుక, ఇళ్ల పట్టాలు, భూములు కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుపై మాపార్టీ చేస్తున్న ఆందోళనలు ప్రజలు గుర్తించారని మీకు అర్థం అవుతోందా?
 
స్పష్టంగా ప్రజల దృష్టిని మళ్ళించే మీ ఎత్తుగడలు మాని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి మంచి
పాలన ఇవ్వండి.
 
వైయస్ ఆర్ పార్టీ వైఫల్యాలను , బీజేపీ ప్రజల ముందుకు తీసుకెళ్ళింది. మరియు మరింతగా తీసుకేళ్ళి పోరాడుతూనే ఉంటుంది. మీరు చేస్తున్న విమర్శలు, మా పార్టీ నేతల నైతిక స్థైర్యాన్ని మరింతగా పెంచుతున్నాయి" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాజిక సంక్రమణ లేదు... రికవరీ రేట్ 62 శాతం : కేంద్రం క్లారిటీ