Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని.. తల్లిదండ్రులు తిట్టలేదనీ సూసైడ్

సాధారణంగా పరీక్షల్లో ఫెయిలైతే తల్లిదండ్రులు మందలించారని, ఫ్రెండ్స్ హేళన చేశారనీ చిన్నబుచ్చుకుని చనిపోయిన వాళ్లను చూశాం. అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నవారినీ చూసాం. అయితే ఓ విద్యార్థిని మాత్రం తాను ప

పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని.. తల్లిదండ్రులు తిట్టలేదనీ సూసైడ్
, సోమవారం, 14 మే 2018 (10:28 IST)
సాధారణంగా పరీక్షల్లో ఫెయిలైతే తల్లిదండ్రులు మందలించారని, ఫ్రెండ్స్ హేళన చేశారనీ చిన్నబుచ్చుకుని చనిపోయిన వాళ్లను చూశాం. అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నవారినీ చూసాం. అయితే ఓ విద్యార్థిని మాత్రం తాను పరీక్షలో ఫెయిలైనా అమ్మానాన్న తిట్టలేదని ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ విషాదకర ఘటన ప్రశాశం జిల్లా జరిగింది. ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తురకపాలెం గ్రామానికి చెందిన గురులక్ష్మి (20) విద్యార్థిని.. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్‌ చదువుతోంది. ఈ క్రమంలో గురులక్ష్మి మొదటి సంవత్సరంలో 9 సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అయినా తల్లిదండ్రులు పల్లెత్తు మాటనలేదు. 
 
దీనికి విద్యార్థిని మరింత మనస్తాపం చెందింది. చిన్న సూసైడ్‌ నోట్‌ రాసి.. ఈనెల 11వ తేదీ శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ హస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది.
 
పరీక్షలో ఫెయిలైన తమ అమ్మాయిని తిడితే ఏమన్నా చేసుకుంటుందో ఏమోనని.. ఎప్పుడూ తిట్టేవారిమి కాదని.. అయినా తన కూతురు సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల కిరీటం కన్నాకే... ఆ వెంటనే ముద్రగడ భేటీ...