గుంటూరు: శ్రీకాకుళం జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ సహాయ పథక సంచాలకులు (ఏపీడీ) పరసా రాధాకృష్ణ కరోనాతో బుధవారం మృతి చెందారు. గుంటూరు శ్యామలానగర్‌లో ఉంటున్న ఆయన జిల్లాలోని రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవోగా పని చేశారు.
ఇటీవల ఏపీడీగా పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయడంతో అక్కడ కొన్ని నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. పది రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
బుధవారం గుండెపోటుకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాధాకృష్ణ మరణంతో కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన సీడీపీవోలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.