విడిపోయే దిశగా టీడీపీ అడుగులు... హోదాకు నో అన్నందుకు బాబు బాధ!
న్యూఢిల్లీ : ప‌్రత్యేక హోదాకు కేంద్రం నో అన్నందుకు టీడీపీ బాగా నొచ్చుకుంది. ఏపీలో ప్రజలకు స్పెషల్ స్టేటస్... సెంటిమెంట్‌గా మారిన తరుణంలో కేంద్రం మొండికేయడం... టీడీపీకి మింగుడుపడటం లేదు. హోదా ఇవ్వలేరట... దానికి మించిన ప్యాకేజి ఇస్తామంటున్
న్యూఢిల్లీ : ప‌్రత్యేక హోదాకు కేంద్రం నో అన్నందుకు టీడీపీ బాగా నొచ్చుకుంది. ఏపీలో ప్రజలకు స్పెషల్ స్టేటస్... సెంటిమెంట్‌గా మారిన తరుణంలో కేంద్రం మొండికేయడం... టీడీపీకి మింగుడుపడటం లేదు. హోదా ఇవ్వలేరట... దానికి మించిన ప్యాకేజి ఇస్తామంటున్నారని... కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. ఇంకా పోలవరానికి నాబార్డు నిధులు ఇస్తామని కేంద్రం ఒప్పుకుందని... తాయిలాల గురించి చెప్పుకొచ్చారు.
కానీ, ఇవేవీ ఏపీ ప్రజలకు రుచించవని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మథనపడుతున్నారు. హోదా వైపే మొగ్గు చూపాలని, వారివ్వకపోతే కేంద్రం నుంచి విడిపోయే పరిస్థితి ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే, ఇక్కడి ప్రజలు కేంద్రంతో టీడీపీ కుమ్మక్కయి... ఏపీ ప్రయోజనాలకు తాకట్టు పెట్టిందనే భావన కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఒక పక్క కేంద్రంతో చెలిమి, మరో పక్క హోదాతో లింకు... ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది టీడీపీ పరిస్థితి. ఇలాంటి దశలో మరోపక్క ఓటుకు నోటు కేసు... ఈ టెన్షన్ల నుంచి కాస్త రిలీఫ్ కోసమే చంద్రబాబు గోవా టూర్ ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు.