Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

arrested

ఠాగూర్

, ఆదివారం, 6 అక్టోబరు 2024 (18:16 IST)
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి పెట్టిన మిస్సింగ్ కేసును మూడు రోజుల్లోనే పరిష్కరించారు. బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసులో ముగ్గురుని అరెస్టు చేశారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలో ఏర్పడిన వివాదం కారణంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు. 
 
చిన్నారి బాలిక తండ్రి.. రేష్మ అనే మహిళకు రూ.3 లక్షల అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో తిట్టడంతో పాటు బెదిరించాడు. కోర్టుకు లాగుతానని హెచ్చరించాడు. దాంతో రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది. 
 
అతడి కుమార్తెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, కొందరి సహకారంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు. 
 
కాగా, ఈ హత్య కేసుపై జిల్లా కలెక్టర్ సుమీత్ స్పందిస్తూ, కొన్ని చానళ్లు మాత్రం బాలిక మృతిపై అసత్య ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలను ప్రసారం చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. అలాగే, హో మంత్రి అనిత కూడా మాట్లాడుతూ, బాలికపై అత్యాచారం జరగలేదని చెప్పారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు