Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంక్షల మధ్య వినాయక చవితి పండుగ జరుపుకోండి... ఏపీ మంత్రి వెల్లంపల్లి

ఆంక్షల మధ్య వినాయక చవితి పండుగ జరుపుకోండి... ఏపీ మంత్రి వెల్లంపల్లి
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షల మధ్య వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. పైగా, వినాయక చవితి చేసుకోకూడదని ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? నిలదీశారు. ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా..? పెద్దఎత్తున వేడుకలు జరగకుండా, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. కేంద్ర హోం శాఖ ఆగస్టు 28న ఇచ్చిన గైడ్ లైన్సును అనుసరించి పండుగ జరుపుకోవాలనే చెప్పామని వివరించారు.
 
అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి కావడం వల్లే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి వెల్లంపల్లి కొట్టిపారేశారు. 
 
పండుగలకు కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభించాలని కోరుకుంటున్నారా ? మండిపడ్డారు.
 
వినాయక చవితి అందరి పండుగ అన్న మంత్రి.. ఇళ్ళల్లో, దేవాలయాల్లోనూ చేసుకోవచ్చన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెట్టి, ఊరేగింపులు, భారీ ఎత్తున వేలు, లక్షల మందితో ఊరేగింపులు, హంగామాలు, ఆర్భాటాలు చేయడం వద్దని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రానికి చీవాట్లు : మా సహనాన్ని పరీక్షించొద్దన్న సుప్రీం