Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. లోపాలు ఉన్నాయని ఎలా అంటారు?

దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. లోపాలు ఉన్నాయని ఎలా అంటారు?
, మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:15 IST)
దిశ చట్టంలో లోపం ఉంది సరిచేయమని కోరుతుంటే అధికారపక్షం ఎదురుదాడి చేస్తున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘాటుగా స్పందించారు. దిశ బిల్లు చేసి చట్టం ఇంకా అమల్లోకి రాలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గుర్తుచేశారు. 
 
దిశ చట్టంలోనే లోపం ఉంది. కాబట్టి ఏదో జరుగుతోందని అనటం ఏంటని బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. సభా వ్యవహారాలు ఏదో తెలియని వాళ్లు, మొదటిసారి సభకు వచ్చిన వారు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంటుందని బుగ్గన ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడు కూడా అదే చెప్పటంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అని బుగ్గన నిలదీశారు. ఇంకా దిశ చట్టమే అమల్లోకే రాలేదు. 
 
ఇపుడు చట్టం తయారు చేశాక మరుసటి రోజు పొద్దున్నే అమల్లోకి వస్తుందా అని బుగ్గన నిలదీశారు. 
 
ఈ అంశంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుంటూ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజల కోసం తయారు చేస్తుందని అన్నారు. జరుగుతున్న సంఘటనలు అన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్‌ నిలదీశారు. 
 
దిశ చట్టం నిన్నగాక మొన్న చట్టం అయింది. ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయి. అవి ప్రజలకు రీచ్ కావాలన్నారు.  ప్రతిపక్షాల సూచిస్తున్న సూచనలను హోంమంత్రి గారు నోట్‌ చేసుకొని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ చోరీ చేశాడనీ వృషణాలు కోసిపారేశారు... ఎక్కడ?