Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

Advertiesment
whatsapp

సెల్వి

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (13:30 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ పరీక్ష హాల్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. చెల్లించని ఫీజుల కారణంగా ప్రైవేట్ సంస్థలు హాల్ టిక్కెట్లను నిలిపివేసినప్పుడు విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
తద్వారా విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సజావుగా పొందవచ్చు. ఎటువంటి భయం లేకుండా పరీక్షలకు హాజరు కావచ్చు.ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు సందేశం పంపడం ద్వారా వారి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
భవిష్యత్తులో ఈ సేవను 10వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది.  ఇది ఏపీ రాష్ట్రంలోని వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థలో భాగం.
 
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఇప్పటికే ప్రాక్టికల్, వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రాక్టికల్ పరీక్షలు: ఫిబ్రవరి 10 నుండి 20 వరకు, రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. ఒకేషనల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 22న ప్రారంభమవుతాయి.
 
ఫస్ట్-ఇయర్ ఫైనల్ పరీక్షలు: మార్చి 1 నుండి 19 వరకు.
సెకండ్-ఇయర్ ఫైనల్ పరీక్షలు: మార్చి 3 నుండి 20 వరకు.
విద్యార్థులకు చివరి నిమిషంలో ఎలాంటి సమస్యలు లేకుండా తమ హాల్ టిక్కెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?