Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గే దుర్గతి నాశని... అంటూ అమ్మవారిని ప్రార్ధించాను

దుర్గే దుర్గతి నాశని... అంటూ అమ్మవారిని ప్రార్ధించాను
విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (12:15 IST)
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలి రోజు దుర్గ‌మ్మ‌ను శ‌ర‌న్న‌వరాత్రుల్లో ద‌ర్శించుకున్నారు. దసరా మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరం అని, దుర్గే దుర్గతి నాశని... అంటూ అమ్మవారిని ప్రార్ధించాన‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నాన‌ని, కరోనా ను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని వేడుకున్నా అని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. అమ్మవారి దర్శనంతో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నాన్నారు. 
 
ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ను కూడా గ‌వ‌ర్న‌ర్ తో పాటు ద‌ర్శించారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి గా అమ్మవారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామ‌ని, క్యూలైన్లో కేశఖండన శాల అన్నప్రసాదాలు శానిటేషన్ అన్నిరకాల సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నార‌ని మంత్రి వెల్లంప‌ల్లి చెప్పారు. ప్ర‌త్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేశామ‌ని, వీఐపీల తాకిడి ఉన్నాసామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా 5 వరుసలు క్యూలైన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. 12 తేదీ మూలానక్షత్రం రోజున ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జ‌గ‌న్ ఆలయానికి వస్తార‌ని, మంత్రి వెల్ల‌డించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దసరా నవరాత్రులు జరుపుకోవాల‌ని, గతంలో కొండచరియలు పడటం లాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామ‌ని చెప్పారు. తిరుపతి తర్వాత రెండో దేవాలయంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని తయారు చేస్తాం అని దేవాదాయ‌శాఖ మంత్రి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ - తెలంగాణ సీఎంగా కేటీఆర్