Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధార్ తరహాలో పరిశ్రమలకు ప్రత్యేక సంఖ్య.. పరిశ్రమ ఆధార్ పేరిట?

Advertiesment
Andhra pradesh
, గురువారం, 13 ఆగస్టు 2020 (18:09 IST)
ఏపీలోని జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 'పరిశ్రమ ఆధార్' పేరుతో ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో పనిచేయనుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.
 
కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరించనుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశోక్ గెహ్లాట్ సర్కారుపై అవిశ్వాస పరీక్ష : బీజేపీ నిర్ణయం