Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క రూపాయి కూడా ప్రజాధనం వృధాకాదు : ఆర్థిక మంత్రి బుగ్గన

Advertiesment
Buggana Rajendranath Reddy
, సోమవారం, 1 జులై 2019 (09:31 IST)
గత ఐదేళ్ళ టీడీపీ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుందని వాటిల్లో అవకతవకలు ఉన్నాయని వివిధ సంస్థలు, వ్యక్తులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ ఆరోపణలు ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే 2019 ఎన్నికల్లో తమ నిర్ణయం తెలిపారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు నమ్మారు. దీనిపై ఎంతో మంది ఇంజనీరింగ్ నిపుణులు, మాజీ బ్యూరోక్రాట్ నిపుణులు చెప్పారు. మాజీ ఇద్దరు బ్యూరోక్రాట్ నిపుణులు భారీగా అవినీతి జరిగిందని, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. వీటిని అన్నింటిని సరిచేయటానికి చేయటానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 26, 2019న జీఓ నెం 1411 ద్వారా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని బుగ్గన వివరించారు.  
 
ఈ సబ్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే... ఏఏ విషయాల్లో మరి ప్రాజెక్టులు, నిర్మాణాత్మక పనులు ఎక్కువ ధరలకు కేటాయించడం సింగల్ టెండర్ రావటం, అవినీతి ఆరోపణలు ఎక్కడైతే ఉన్నాయో పరిశీలించటం, కొన్ని ప్రాజెక్టులు అవసరమా, లేదో పరిశీలించటం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. 
 
సబ్ కమిటీ నివేదిక ప్రకారం "వివిధ ప్రభుత్వ శాఖలు సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, సెంట్రల్ ఏజెన్సీ కావొచ్చు అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. ప్రజాధనం ఏదైతే ఉన్నదో.. ప్రజలు పన్నులు కట్టిన డబ్బు సక్రమంగా వినియోగం అయ్యాయా లేక అవినీతి ఏమైన జరిగిందా? ఒక అవినీతి జరిగి ఉన్నట్లైతే దాన్ని సరిచేయటం చేయటం ఎలా? అన్న దానికోసమే ఈ సమావేశం అన్నారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున పారదర్శకమైన పరిపాలన, అవినీతిలేని పరిపాలన చేస్తామని ప్రకటించడం జరిగింది. ఎక్కడా ప్రజాధనం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉపయోగించాలనే సబ్ కమిటీ వేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 
 
సబ్ కమిటీ వేటిమీద విచారణ చేస్తుందని మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భూకేటాయింపులు కావొచ్చు, రాజధాని భూములు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయ్. గత ప్రభుత్వం ఏదీ వదిలిపెట్టలేదని చివరకు పుష్కరాలప్పుడు నీటి ప్యాకెట్లు, షామియానాలు కూడా ఉన్నాయ్ అని బుగ్గన వివరించారు. మీరు పెద్ద పెద్దవి అడుగుతున్నారు టీడీపీ వాళ్లు ఏదీ వదలపెట్టలేదని దోమలపై దండయాత్ర, ఎలుకలు పట్టడానికి 6 లక్షలు ఖర్చు పెట్టిన సంఘటనలపైనా విచారణ జరుగుతుందని బుగ్గన అన్నారు.

విచారణ జరిగాక భవిష్యత్ లో తప్పులు జరగక్కుండా ఇదొక హెచ్చరికగా ఉంటుందన్నారు. అంశాలు ఎక్కువ ఉన్నా.. ముఖ్యమైనవి ఎవరిపాటికి వారు విడిపోయి దర్యాప్తు చేస్తారని బుగ్గన తెలిపారు. నీటిపారుదల, అర్బన్ హౌసింగ్, భూకేటాయింపులు, రాజధాని భూములు ప్రధానమైనవిగా ఉన్నాయని బుగ్గన తెలిపారు. అవినీతికి ఏ ఒక్కటినీ గత ప్రభుత్వం వదిలిపెట్టలేదని బుగ్గన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది రైతు ప్రభుత్వం... అమానుషంగా ప్రవర్తిస్తే అంతేసంగతులు : మంత్రి కన్నబాబు