Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుటుంబ సభ్యుల జోక్యం వద్దనే వద్దు... పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ (Video)

pawan kalyan

ఠాగూర్

, ఆదివారం, 10 నవంబరు 2024 (11:21 IST)
నామినేటెడ్ పదవులను దక్కించుకున్న పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. కుటుంబ సభ్యుల జోక్యం ఏమాత్రం వద్దనే వద్దని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో ఆయన శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
'గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అవినీతి లేకుండా పని చేయాలి. పార్టీ మరింతగా ప్రజలకు దగ్గరయ్యేలా పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రొటోకాల్ మర్చిపోవద్దు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకు తగిన గౌరవం ఇస్తూ, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని, కేవలం జనసేన పార్టీ ప్రతినిధులుగానేకాకుండా ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా మాట్లాడాలి అని సూచించారు. 
 
'కుల గణాంకాలు కావాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. నైపుణ్య గణాంకాలతో పాటు కుల గణాంకాలూ తీసుకోవాలి. దానిలో తప్పు లేదు. ఇది రాష్ట్రంలో సంపూర్ణంగా జరగాలన్నదే నా ఆలోచన. మీడియా వద్ద వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. పాలసీలపైనే చర్చ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే నా పేష్ దృష్టికి తీసు కురావాలి' అని పవన్ కోరారు. 
 
నామినేటెడ్ పదవులు పొందిన అందరికి ప్రత్యేకంగా అభి నందనలు తెలిపారు. ఏస్ఎంఎస్ఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), ఇతర నాయకులకు ఆయన పేరు పేరునా అభినందనలు తెలిపారు. 
 
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. పోలీసులూ బాధ్యతగా వ్యవహరించండి... రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
 
ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులు తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. 
 
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 'రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ తీవ్రమైంది. అంతటి కష్టాన్ని దిగమింగుకుని, బ్రెయిన్ డెడ్ అయిన రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం తనను కదిలించింది. పోలీసులు ప్రమాదానికి కారకుడైన డ్రైవరుపై కేసు పెట్టలేదు. కారులో ప్రయాణిస్తున్న వైద్యుడు కూడా బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం. పోలీసులు ప్రవర్తించిన తీరుకు తాను క్షమాపణలు చెబుతున్నా' అని అన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు