Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

Advertiesment
pawan - nadendla

ఠాగూర్

, సోమవారం, 24 నవంబరు 2025 (14:45 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటన కోసం ఆయన విజయవాడ గన్నవరం నుంచి రాజమహేంద్రవరం మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు పవన్ కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 
 
ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ అక్కడి నుంచి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు పూర్ణకుంభం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారికి పవన్‌ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆవిష్కరించారు. గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణపనులను పవన్ ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్