Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌కు కాలు బెణికింది... ఇంట్లో తుపాకీతో కాల్చి కొందరు బయట తిరుగుతున్నారు..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుడి కాలు బెణికింది. పశ్చిమ గోదావరి జిల్లా పోరాటయాత్రలో వున్న పవన్ కల్యాణ్‌ భీమవరం ఎన్డీ ఫంక్షన్ హాలులో బసచేశఆరు. కానీ వారితో మాట్లాడేందుకు వెళ్లడంతో గచ్చు తడి కారణంగా

Advertiesment
పవన్‌కు కాలు బెణికింది... ఇంట్లో తుపాకీతో కాల్చి కొందరు బయట తిరుగుతున్నారు..
, బుధవారం, 25 జులై 2018 (10:46 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుడి కాలు బెణికింది. పశ్చిమ గోదావరి జిల్లా పోరాటయాత్రలో వున్న పవన్ కల్యాణ్‌ భీమవరం ఎన్డీ ఫంక్షన్ హాలులో బసచేశఆరు. కానీ వారితో మాట్లాడేందుకు వెళ్లడంతో గచ్చు తడి కారణంగా కాలు జారి బెణికింది. వెంటనే, వైద్యులు పరీక్షించారని, పవన్ కాలుకి క్యాప్ వేశారని, కాలు నొప్పి లేకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ వాడాలని, ఆయనకు స్వల్ప విశ్రాంతి అవసరమని సూచించినట్టు జనసేన వెల్లడించింది. 
 
కాలు నొప్పితో బాధపడుతున్న పవన్, తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడలేకపోయారు. ఈ సందర్భంగా పవన్‌ని కలిసేందుకు పార్టీ స్థాయిలో కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు అక్కడికొచ్చారు. మరోవైపు ఇంట్లో తుపాకీతో కాల్చిన వారు ఇప్పుడు బయట తిరుగుతున్నారని, పోలీసులు వాళ్లను ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఈ విమర్శలు చేసినప్పటికీ, ఇవి హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి చేసినవేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పెడుతున్నారు. 
 
2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలగా, నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎవరు కాల్చారో తనకు తెలియదని బెల్లంకొండ చెప్పడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా న్యాయస్థానం ఈ కేసును కొట్టేసిన సంగతి తెలిసిందే. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన సందర్భంగా.. జ‌న‌సేన సైనికులు బైక్ సైలెన్స‌ర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసిన‌ట్లు చూస్తున్నారని పవన్ ఆరోపించారు. 
 
ఇంట్లో తుపాకీతో కాల్చి బ‌య‌ట‌ తిరుగుతున్న వాళ్ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. జ‌న‌ సైనికుల సంస్కారం చాలా గొప్ప‌ద‌న్నారు. అధికారులు లంచాల మ‌త్తులో మునిగి ఉన్నారని, అక్ర‌మంగా ఆక్వాకు వంత‌ పాడ‌ుతున్నారని, అందువల్లే తాగు నీరు క‌లుషిత‌మ‌వుతుంద‌ని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారి చెబితే అర్థంకాదా... రామాయణం అంతా విని... హోదాపై రాజ్‌నాథ్