Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్.. కేబినేట్ కీలక నిర్ణయాలు

ఉద్యోగులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్.. కేబినేట్ కీలక నిర్ణయాలు
, శుక్రవారం, 21 జనవరి 2022 (18:33 IST)
ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. జగనన్న టౌన్ షిప్పులలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉద్యోగులతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు.  
 
అలాగే ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద మహిళలకు రూ.45 వేల ఆర్థికసాయం 
ఈబీసీ నిధులు రూ.580 కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించింది.

కేబినేట్ కీలక నిర్ణయాలు
45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున సాయం  
3.92 లక్షల మందికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లు సాయం
బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదు ఎకరాల భూమి కేటాయింపు  
టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా చట్ట సవరణకు ఆమోదం
ఐసీడీఎస్ లో బాలామృతం, పాల సరఫరాను అమూల్ కు అప్పగిస్తూ నిర్ణయం
 
విశాఖలో అదాని డేటా సెంటర్ కు భూమి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం  
వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజ్ ప్రతిపాదనకు ఆమోదం 
కడప, కర్నూలు విమానాశ్రయాల్లో రాకపోకలకు ఇండిగోతో ఒప్పందం
కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను 25 ఏళ్లు బిడ్ ద్వారా అప్పగించాలని నిర్ణయం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసినో క‌క్ష‌లు... గుడివాడ‌లో టీడీపీ వైసీసీ బాహాబాహీ!