Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్ ఆన్ ఐడియా సర్జీ.. :: సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టు పేరుతో అప్పు...

Advertiesment
cctv
, శుక్రవారం, 22 డిశెంబరు 2023 (07:32 IST)
అప్పులు ఎలా తెచ్చుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం వద్ద నేర్చుకోవచ్చు. ఇప్పటికే తాహాసీల్దారు కార్యాలయం నుంచి పోలీస్ క్వార్టర్లు, కలెక్టర్ కార్యాలయాలు ఇలా ప్రతి ఆస్తిని తనాఖా పెట్టి అప్పులు తెచ్చుకుంది. ఇపుడు తనఖా పెట్టేందుకు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో సరికొత్త ఆలోచనకు తెరతీసింది. సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టు పేరుతో కొత్తగా అప్పు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ వింత ఆలోచన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
నాలుగున్నరేళ్లుగా సీసీ కెమెరాల ప్రాజెక్టును మూలనపడేసి.. ఎన్నికలకు ముందు ఇప్పుడు తెరపైకి తెచ్చింది. దీనికోసం ఏపీ ఫైబర్ నెట్ (ఏపీఎస్ఎస్ఎల్) తీసుకునే రూ.552.7 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 12న సంస్థ ఎండీ అలా లేఖ రాశారో లేదో.. పట్టుమని 10 రోజులు తిరగకుండానే రుణం తీసుకోడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రుణంగా తీసుకునే మొత్తం ఎస్క్రో ఖాతాలో కాకుండా.. సంస్థ ఖాతాకు జమకానుంది. ఆ మొత్తాన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకే వాడతారా లేక ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తుందా.. అనే అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 
 
కొద్ది నెలల కిందట భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ (బీబీఎన్ఎల్) పనుల కోసం రూ.600 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నుంచి ఏపీఎస్ఎస్ఎల్ తీసుకుంది. రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ప్రతిపాదనలో చూపిన లెక్కలే విచిత్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి.. వారి నుంచి జరిమానాలు వసూలు చేసి.. ఆ మొత్తం నుంచి చెల్లిస్తామని సంస్థ పేర్కొనడం గమనార్హం. దీనికోసం పోలీసు, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని.. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరుల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తామని మరీ పేర్కొనడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావా రూ. 11,999కు 8జిబి RAM, డైమెన్సిటి 6080తో పవర్ ప్యాక్ట్ ‘స్టార్మ్ 5జి’ విడుదల