ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. మొత్తం 18 యేళ్ల కాలానికి 7.85 వడ్డీతో ఈ మొత్తాన్ని సేకరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న విషయం తెల్సిందే.
పైగా, ప్రతి మంగళవారం భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తీసుకోనిదే ప్రభుత్వం యంత్రాన్ని నడపలేని దుస్థితి నెలకొంది. దీంతో ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు క్రమం తప్పకుండా హాజరవుతూ కుప్పలు తెప్పలుగా అప్పులు సేకరిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం మరో రూ.500 కోట్ల రుణాన్ని సేకరించింది. 18 యేళ్ల కాలానికి 7.85 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది.
తాజా రుణంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పులు రూ.52,108 కోట్లకు చేరింది. ఇప్పటికే కేంద్రం నిర్ధేశించిన ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిని ఏపీ సర్కారు దిగ్విజయంగా దాటేసింది. ఈ క్రమంలో తాజాగా మరో రూ.500 కోట్ల రుణం తీసుకోవడం గమనార్హం.