Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు?

andhrapradesh logo
, శుక్రవారం, 16 డిశెంబరు 2022 (10:15 IST)
2023 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సెలవుల క్యాలెండర్‌ను గురువారం రిలీజ్ చేశింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. 
 
రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాడ్ ఉన్ నబీ వంటి పండుగలతో పాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది. వాటిని ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
 
అలాగే, ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి పండుగల సమయాల్లో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాతాధికులు అనుమతితో ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. ఇక వచ్చే యేడాది మూడు సాధారణ సెలవులు, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం వచ్చాయి. ఒకటో తేదీ శనివారం వచ్చింది.
 
అయితే, ఉగాది, శ్రీరామ నవమి, వినాయకచవితి వంటి హిందూ పండుగలకు సెలవులు లేకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమైన హిందూ పండుగలకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణం ఈ మూడు పండుగలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసింది.
 
2023లో సాధారణ సెలవులు ఇవే....
భోగి - జనవరి 14 (శనివారం) 
సంక్రాంతి - జనవరి 15 (ఆదివారం) 
కనుమ - జనవరి 16 (సోమవారం) 
రిపబ్లిక్ డే - జనవరి 26 (గురువారం) 
మహాశివరాత్రి - ఫిబ్రవరి 18 (శనివారం)
హోళి - మార్చి 8 (బుధవారం)
ఉగాది - మార్చి 22 (బుధవారం)
శ్రీరామనవమి - మార్చి 30 (గురువారం) 
బాబు జగ్జీవన్ రామ్ జయంతి - ఏప్రిల్ 5 (బుధవారం)
గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 7 (శుక్రవారం)
అంబేద్కర్ జయంతి - ఏప్రిల్ 14 (శుక్రవారం)
రంజాన్ - ఏప్రిల్ 22 (శనివారం) 
బక్రీద్ - జూన్ 29 (గురువారం)
మొహర్రం - జూలై 29 (శనివారం)
సాతంత్య్ర దినోత్సవం - ఆగస్టు 15 (మంగళవారం)
శ్రీకృష్ణాష్టమి - సెప్టెంబరు 6 (బుధవారం)
వినాయకచవితి - సెప్టెంబరు 18 (సోమవారం)
ఈద్ మిలాద్-ఉన్-నబీ - సెప్టెంబరు 28 (గురువారం)
మహాత్మాగాంధీ జయంతి - అక్టోబరు 2 (సోమవారం)
దుర్గాష్టమి - అక్టోబరు 22 (ఆదివారం)
విజయదశమి - అక్టోబరు 23 (సోమవారం)
దీపాళి - నవంబరు 12 (ఆదివారం)
క్రిస్మస్ - డిసెంబరు 25 (సోమవారం) 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రాష్ట్రంలో పుట్టడం కంటే పక్క వేరే రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేది.. బ్రదర్ అనిల్