Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.3 కోట్లకు సిద్ధపడ్డా.. రూ.కోటి ఖర్చుచేసి ప్రణయ్‌ని లేకుండా చేస్తా : మారుతిరావు శపథం

తన కుమార్తె అమృతను వదిలిపెట్టేందుకు ప్రణయ్‌తో పాటు అతని కుటుంబానికి మూడు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడినా.. కానీ, ఈ ఆఫర్‌ను వారు తిరస్కరించారు. అందుకే రూ.3 కోట్లలో రూ.కోటి ఖర్చు పెట్టి అయినా ప్రణయ

రూ.3 కోట్లకు సిద్ధపడ్డా.. రూ.కోటి ఖర్చుచేసి ప్రణయ్‌ని లేకుండా చేస్తా : మారుతిరావు శపథం
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (09:24 IST)
తన కుమార్తె అమృతను వదిలిపెట్టేందుకు ప్రణయ్‌తో పాటు అతని కుటుంబానికి మూడు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడినా.. కానీ, ఈ ఆఫర్‌ను వారు తిరస్కరించారు. అందుకే రూ.3 కోట్లలో రూ.కోటి ఖర్చు పెట్టి అయినా  ప్రణయ్‌ను లేకుండా చేస్తానని తన కుటుంబ సభ్యుల వద్ద మిర్యాలగూడ పరువు హత్య కేసులో ఏ1 నిందితుడైన మారుతిరావు శపథం చేసినట్టు సమాచారం.
 
ఇందులోభాగంగా, తన మాటను నిలబెట్టుకునేందుకు ప్రణయ్‌ను హత్య చేయించాడు. నిజానికి పెళ్లి చేసుకున్న తర్వాత వర్షిణిని ఒప్పించి, తన ఇంటికి పంపేస్తే రూ.3 కోట్లు ఇచ్చేందుకు మారుతి రావు ఆఫర్ ఇచ్చాడు. ప్రణయ్‌ కుటుంబం దాన్ని తిరస్కరించడంతో మారుతిరావు రగిలిపోయాడు. తన కుమార్తెను ఎలగైనా తన వద్దకు రప్పించుకోవాలన్న పట్టుదలతో కిరాతకుడిగా మారిపోయాడు.
 
ఇక్కడే ప్రణయ్‌‌ను హత్య చేయాలన్న బీజం పడింది. ప్రణయ్‌ హత్యకు తన తమ్ముడు శ్రవణ్‌, స్నేహితుడు అబ్దుల్‌ కరీంతో కలిసి మారుతీరావు పథకం వేశాడు. గతంలో ఓ భూ వివాదంలో తనను కిడ్నాప్‌ చేసిన అబ్దుల్‌ బారీని ఇందుకు ఉపయోగించుకోవాలని భావించాడు. తొలుత ఫోనులో సంప్రదించాడు. తన పిలుపుతో మిర్యాలగూడకు వచ్చిన అస్ఘర్ కరీం, బారీలకు తన కూతురి పెళ్లి విషయాన్ని మారుతిరావు వివరించారు. ఎలాగైనా ప్రణయ్‌ను అంతం చేయాలని ప్రాధేయపడ్డాడు. ఇందుకు అస్ఘర్‌, బారీలు రూ.2 కోట్లు డిమాండ్‌ చేయగా.. రూ.కోటి సుపారీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. 
 
ఆ తర్వాత మిర్యాలగూడలో చర్చి రోడ్డులోని ప్రణయ్‌ ఇంటిని చూపించాడు. అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు చెల్లించాలని బారీ డిమాండ్‌ చేయగా.. జూలై 9, 10 తేదీల్లో కరీంకు మారుతీ రావు రూ.15 లక్షలు ఇచ్చాడు. వాటిని బారీకి ఇచ్చి రావాలని తన ఫార్చ్యునర్‌ కారులో డ్రైవర్‌ శివను ఇచ్చి పంపాడు. ఫిలిం సిటీ వద్ద నగదును కరీం అందజేశాడు. డబ్బు ముట్టినట్టు మారుతీరావుకు ఫోన్లో బారీ నిర్ధరించాడు. ఆ రూ.15 లక్షల్లో రూ.8 లక్షలు బారీ, రూ.6 లక్షలు అస్ఘర్‌, రూ.1 లక్ష కరీం పంచుకున్నారు.
 
ప్రణయ్ హత్యకు గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌ పాండ్య హత్య కేసులో జైల్లో ఉన్నప్పుడు బిహార్‌కు చెందిన రౌడీ షీటర్‌ సుభాష్‌ కుమార్‌ శర్మకు అబ్దుల్‌ బారీ, అస్ఘర్‌లకు పరిచయం ఏర్పడింది. అదేసమయంలో, తనకు ఉపాధి కావాలంటూ ఇటీవల సుభాష్‌ శర్మ తరచూ బారీకి ఫోన్‌ చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే, ప్రణయ్‌ను సుభాష్‌ శర్మతో హత్య చేయించాలని అస్ఘర్‌, బారీ నిర్ణయానికి వచ్చారు. ప్రణయ్‌ని చంపడానికి ఫోన్‌లో ఒప్పించి బిహార్‌ నుంచి పిలిపించాడు. 
 
కోటి రూపాయల్లో రూ.25 లక్షలు సుభాష్‌ శర్మకు ఇచ్చి మిగిలిన సొమ్మును రెండు భాగాలుగా అస్ఘర్‌, బారీ పంచుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఆ తర్వాత స్కూటర్‌తో పాటు ఆయుధాలను, బోగస్ పేర్లతో సిమ్ కార్డులను సిద్ధం చేశారు. ఆగస్టు 9 నుంచి రెక్కీలు నిర్వహించారు. 14న వర్షిణి బ్యూటీ పార్లర్‌కు వెళ్లగా అక్కడ హత్యకు ప్రయత్నించారు. ప్రణయ్‌తోపాటు అతని సోదరుడు కూడా ఉండటంతో వారిలో ప్రణయ్‌ ఎవరో తేల్చుకోలేక వెనక్కి తగ్గారు. ఆగస్టు 22న సుభాష్‌ శర్మ నేరుగా ప్రణయ్‌ ఇంటికి వెళ్లి చంపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ప్రణయ్‌ ఇంట్లో లేకపోవడంతో అది కూడా ఫెయిలైంది. 
 
అదేసమయంలో తన కుమార్తె గర్భవతి అని మారుతి రావు తెలుసుకున్నాడు. సెప్టెంబరు 14న ఆమె ఆరోగ్య పరీక్షలకు ఆస్పత్రికి వెళుతుందని తన భార్య గిరిజ ద్వారా మారుతీరావు పక్కా సమాచారం తెలుసుకుని, హంతక ముఠాకు చేరవేశాడు. పథకం ప్రకారం సుమారు 11:45 గంటలకు మారుతీ రావు తన డ్రైవర్‌ శివతో కలిసి కారులో కలెక్టర్‌ ఆఫీసులో పని ఉందని చెప్పి మిర్యాలగూడ నుంచి వెళ్లిపోయాడు.
 
14న మధ్యాహ్నం 1:30 గంటలకు వర్షిణి, ప్రణయ్‌ మెడికల్‌ చెకప్‌ పూర్తి చేసుకొని హాస్పిటల్‌ నుంచి వస్తుండగా ప్రణయ్‌పై సుభాష్‌ కత్తితో దాడి చేశాడు. అనంతరం కత్తిని పక్కన పడేసి.. తనతోపాటు వచ్చిన అస్ఘర్‌తో కలిసి నల్లగొండకు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు.. తదుపరి బెంగళూరుకు పారిపోయాడు. చివరిగా పాట్నాకు చేరుకున్నాడు. హత్య విషయాన్ని బారీకి చెప్పాడు. దాంతో, పని అయిపోయిందని, మిగిలిన డబ్బులు కరీంతో పంపించాలని మారుతికి బారీ చెప్పాడు. మారుతి.. కరీంకు ఫోన్‌ చేసి మిర్యాలగూడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకున్నందుకు కాదు... రిసెప్షన్ హంగామాతో రగిలిపోయిన మారుతిరావు...