గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమేనన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయ స్థాయి బాలికల బాక్సింగ్ పోటీల్లో నగరానికి చెందిన దీక్షిత,పెద్దక్క,శిల్ప,గీత,పూజలు పతకాలు సాధించారు. వీరంతా మంగళవారం ఎమ్మెల్యే అనంతను ఆయన స్వగృహంలో కలిశారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి, బాక్సింగ్ కోచ్ మహేష్ కుమార్,అబ్జల్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి
బిసిల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే అనంత నివాసంలో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూపొందించిన నాయీబ్రాహ్మణ సంక్షేమ బుక్ ను ఎమ్మెల్యే అనంత విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుంది తప్పా ఏనాడు వారి అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు కళ్ళారా చూసి అధికారంలోకి రాగానే ఆయా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఇచ్చిన హామీ మేరకు 56 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలకవర్గాలను సైతం నియమించారన్నారు. నాయిబ్రాహ్మణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో భాగంగా షేవింగ్ షాపులకు ఏటా రూ.10 వేలు అందించడంతోపాటు విద్యుత్ సబ్సిడీని కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా
నాయీ బ్రాహ్మణులకు అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ శ్రీనివాసులుని ఎమ్మెల్యే అనంత అభినందించారు.కార్యక్రమంలో కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి,నవీన్,అనిల్,హౌసింగ్ బోర్డ్ రామకృష్ణ,నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు విజయభాస్కర్, బయన్,శివకుమార్,బంకుశీను,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.