ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఈసారి మాథ్స్ 2ఏ పేపర్ ఇలా రానుంది. కోవిడ్ కారణంగా 2A, 2B విభాగాల నుండి గత ఏడాది తగ్గించిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారు 30 శాతం టాపిక్‌లను, అందులోని సబ్ టాపిక్స్‌ను తొలగించారు. అందువల్ల సిలబస్ నుండి తీసేసిన టాపిక్స్ మినహాయించి మిగిలిన అంశాల నుండే సెకండ్ ఇయర్ మాథమేటిక్స్ ప్రశ్నాపత్రం వస్తుంది.
మొత్తం 75 మార్కులకు మాధమేటిక్స్ సెకండ్ ఇయర్ (2A)పేపర్ వస్తుంది. సెకండ్ ఇయర్ మేధ్స్ సిలబస్ ను 2A, 2B విభాగాలుగా చేశారు. ప్రశ్నాపత్రంలో కూడా 2Aలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు, 2Bలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
ఇందులో 2A లో 75 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. మొదట 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటికి ఛాయిస్ ఉండదు. 10 రాయాల్సి ఉంటుంది.
తరువాత.. 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. చివరిగా.. ఏడు మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి.