Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మత్తుల కోసం అక్భరుద్ధీన్ విజ్ఞప్తి.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Advertiesment
Akbaruddin owaisi
, ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (17:39 IST)
పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతున్నదని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు అక్భరుద్ధీన్. 
 
కాగా అక్బరుద్దీన్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 
ఇకపోతే.. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్భరుద్ధీన్ ప్రగతి భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞాపన పత్రం అందచేశారు. 
 
ప్రతీ ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం వల్ల, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్భరుద్ధీన్ విజ్ఞప్తికి కేసీఆర్ సానుకూలంగా స్పందించి.. నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్‌ను ఇంటికి పిలిపించుకుని..?