Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీలోకి నటి ప్రియారామన్‌

Advertiesment
Actress
, బుధవారం, 24 జులై 2019 (07:54 IST)
ప్రముఖ సినీ నటి ప్రియారామన్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే ఏపీ నేత లు ఆమెతో మాట్లాడినట్టు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ పాల్ఘాట్‌ నాయర్‌ కుటుంబానికి చెందినవారు.

దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోనూ ఆమెకు అనుబంధం ఉండటంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు. నటుడు రజినీకాంత్ స్వీయ నిర్మాణంలో వచ్చిన తమిళ చిత్రం వళ్ళి ద్వారా చిత్ర రంగానికి పరిచయం ఐన నటి ప్రియారామన్ 
 
ఆపై పలు తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించి ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. తమిళ, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ప్రియారామన్ చేరికతో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి పట్టు దొరుకుతుందేమో చూడాలి. ప్రియా రామన్ మేనేజర్ గా వ్యవహరించే రామానుజం చలపతి నగరి తెదెపాలో కీలక వ్యక్తిగా ఉండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో పట్టపగలు కత్తులతో విద్యార్థుల హల్చల్.. నడిరోడ్డుపై నరుక్కున్నారు...