Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

Advertiesment
acharya nagarjuna university got 36th rank in indiaఆచార్య నాగార్జున యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు
విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:07 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లాలో నెల‌కొల్పిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు ల‌భించింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాగార్జున యూనివ‌ర్సిటీకి ఎంతో గుర్తింపు ఉండేది. ఇక్క‌డ ఉన్న‌త విద్య అభ్య‌సించిన వారు దేశ‌, విదేశాల్లో రాణించారు. ఇపుడు ఆ యూనివ‌ర్సిటీకి ర్యాంకింగ్ వ‌చ్చింది.
 
ర్ఇఆంటైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ (లండన్) విడుదల చేసిన 'వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్'లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో 1001 - 1200 కేటగిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సంబంధించి బోధనలో 193వ ర్యాంకు, పరిశోధనల్లో 1.430వ ర్యాంకు, పరిశ్రమలతో సంబంధాలు, సైటేషన్సలో 687వ ర్యాంకును సాధించినట్టు వీసీ పి.రాజశేఖర్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప జిల్లాలో దారుణం.. సొంత చెల్లెలి కొడుకే..?