Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏలూరుకు ఆహ్లాదం కలిగించేలా ఆకర్షణీయ పార్కు

ఏలూరుకు ఆహ్లాదం కలిగించేలా ఆకర్షణీయ పార్కు
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:54 IST)
ఏలూరు నగరంలో 15వ ఆర్ధిక సంఘo ద్వారా మంజూరు అయిన5కోట్ల 50లక్షలు రూపాయలతో ప్రజలకు ప్రాధాన్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.

సెంటర్ లైటింగ్, పార్కులు, స్మశాన వాటికలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఏలూరు నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా అత్యంత ఆకర్షణీయంగా పార్కును సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి పై సమీక్షించారు. 

ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఏలూరులో 54మునిసిపల్ పాఠశాలలో కనీస సౌకర్యాలు, అదనపు తరగతి గదులు నిర్మాణానికి మరో 8కోట్లు రూపాయలు మంజూరు అయ్యాయని త్వరలో పనులు చేయడానికి ప్రతి పాదననలు రూపొందించి తీసుకురావాలని మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.

ఏలూరు నగరంలో రోడ్స్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెడల్పు గా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా ప్రతి పాదనలు సిద్ధం చేయాలని, హిందూ, క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికలకు సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, బిర్లా భవన్ నుండి సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు కూడ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.

ఏలూరులో ప్రజలకు ఆహ్లాద వాతావరణం కలిగించే విధంగా కోటి రూపాయలు అంచనాతో ఒక పార్కును సిద్ధం చేయాలని, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే దిశగా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. 

అన్ని పార్కు లు ఆధునీకరించాలని అదే విధంగా వాకింగ్ ట్రాక్ కూడ ఏర్పాటు చేయాలని, నగరంలో ఉన్న ప్రధాన పార్కులు గుర్తించి మోడల్ గా తీర్చి దిద్దాలని, ఇతర ప్రాంతాల నుండి ఏలూరు నగరానికి వచ్చే ప్రజలకు పార్కులు ఆహ్లాదం కలిగించే రీతిలో సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ కమీషనర్ చంద్రశేఖర్ ను ఆదేశించారు. 

త్వరలో నగరంలో అభివృద్ధి పనులు స్వయంగా పరిశీలిస్తానని నాణ్యత లోపించకుండ అభివృద్ధి పనులు జరగడానికి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏలూరు మునిసిపల్ కమీషనర్ డి చంద్రశేఖర్, పిఓ హరిబాబు, డిఈ లు కొండలరావు, సత్యనారాయణ, పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇళ్లస్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం అంతులేని అవినీతి: టీడీపీ