Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
रविवार, 29 दिसंबर 2024
webdunia
Advertiesment

ఆటో నడుపుతున్న 8 ఏళ్ల బుడ్డోడు..

ఆటో నడుపుతున్న 8 ఏళ్ల బుడ్డోడు..
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:12 IST)
ఆ బుడ్డోడికి మాత్రం అడుకోవాల్సిన వయసులో అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులో కుటుంబ బాధ్యతలను ఆ బుడ్డోడు మోస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో ఓ యువకుడు కారులో వెళ్తున్నాడు. వెళ్లే దారిలో నూతనంగా మార్కెట్లోకి వచ్చిన బ్యాటరీ ఆటోను చూశాడు. 
 
ఆటో నడిపే వ్యక్తిన చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా అవాక్కఅయ్యాడు. ఆ బ్యాటరీ ఆటో నడుపుతోంది యువకుడో, వృద్ధుడో కాదు... ఎనిమిదేళ్ల చిన్నారి రాజగోపాల్ రెడ్డి. 
 
పసివాడైన రాజగోపాల్ రెడ్డి ఆటో నడపడాన్ని గుర్తించిన ఆ యువకుడు వెంటనే అక్కడ ఆగిపోయి ఇంత చిన్న వయసులో ఎందుకు ఆటో నడుపుతున్నావ్ అని ప్రశ్నించారు. ఆ ఆటో నడుపుతున్న బాలుడు రాజగోపాల్ రెడ్డి తండ్రినంటూ ఆటో వెనకున్న వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ముగ్గురు కొడుకులున్న తాము అంధులమని తన కష్టాన్ని చెప్పుకున్నాడు.
 
చిత్తూరు జిల్లా గంగులపల్లికి చెందిన అంధ దంపతుల కుమారుడు రాజగోపాల్ రెడ్డి. తల్లిదండ్రులిద్దరికీ చూపులేకపోవడంతో కుటుంబ పోషణ భారం ఎనిమిదేళ్ల చిన్నారిపై పడింది. 
 
తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఈ-రిక్షాలో గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పుదినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో ఆటో నడపడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కడుపు నింపుకోవాలంటే తప్పదని వారు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ బిల్లు చెల్లించకుండా బాత్రూమ్ కిటికీలోనుంచి పారిపోయిన కస్టమర్!