Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అనే నేను... 30న ఒక్కడినే ప్రమాణం చేస్తా...

Advertiesment
జగన్ అనే నేను... 30న ఒక్కడినే ప్రమాణం చేస్తా...
, ఆదివారం, 26 మే 2019 (15:53 IST)
ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత తన మంత్రివర్గాన్ని విస్తరిస్తానని చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని తెలిపారు. 
 
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కూడా మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని తెలిపారు. 
 
తన తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్క రోజు కూడా సచివాలయానికి వెళ్లలేదన్నారు. అందుకే ప్రజలు బంపర్ మెజార్టీని కట్టబెట్టారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తనపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. పోలవరంలో కుంభకోణం జరిగితే విచారణ చేపడుతామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని భూముల బాగోతం ఓ సంచలనాత్మక స్కామ్: వైఎస్. జగన్