Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏవోబీలో ఎన్‌కౌంటర్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఎస్కేప్.. మనవడు మున్నా హతం...

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన మనవడు ప్రాణాలు కోల్పోయినట్టు వ

Advertiesment
Maoists Killed
, సోమవారం, 24 అక్టోబరు 2016 (15:59 IST)
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన మనవడు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఏవోబీలో కూంబింగ్ నిర్వహిస్తు్న గ్రేహౌండ్స్ దళాలను గమనించిన మావోలు.. ఒక్కసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రాణరక్షణ నిమిత్తం గ్రేహౌండ్స్ దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయినట్టు సమాచారం. 
 
ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్‌ ప్లీనరీపై పక్కా స్కెచ్‌తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలోని తొమ్మిది కిలో మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఈ దాడి చేసినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్‌, ఏడు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఏడు ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్‌, 15 భారీ ఆయుధాలను  స్వాధీనం చేసుకున్నారు.
 
ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టులను పోలీసులు రంగంలోకి దించారు. వారిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైకు వచ్చిన లండన్ వైద్యుడు.. అమ్మ కోసం ఖుష్బూ అపోలో ఆస్పత్రికి...