తెరాస నాయకుడు కేటీఆర్ పోలీసులను దూషించినందుకు ఆయనపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశామని ఐజీ అనూరాధ తెలిపారు. ఈయనతోపాటు మరో 249 మందిపై స్పెషల్ కేసులు పెట్టినట్లు ఆమె వెల్లడించారు.
సకల జనుల సమ్మెలో భాగంగా జరిగిన రైల్ రోకో ఆందోళన చేసినవారిపై మొత్తం 2,382 కేసులు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. బస్సులపై కొంతమంది రాళ్లు రువ్వి ధ్వంసం చేశారనీ, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
రైల్వే ట్రాక్‌లపైకి వచ్చినవారిపై రైల్వే యాక్ట్ కింద కేసులు పెట్టామని చెప్పారు. అరెస్టుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె తెలిపారు.