Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడే టెన్నిస్ తార సానియా నిశ్చితార్థం!

Advertiesment
వార్తలు
భారత సంచలన టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. టెన్నిస్‌తో పాటు తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న సానియా మీర్జా నిశ్చితార్థం ఈ రోజు (శుక్రవారం) రాత్రి 8.30 గంటలకు తాజ్ కృష్ణ హోటల్‌లో వైభవంగా జరుగనుంది.

ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా సానియాను పెళ్లి చేసుకుంటామంటూ ఆకతాయిలు ఆమె ఇంటిముందు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగబోయే సానియా నిశ్చితార్థానికి పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఈ నిశ్చితార్థ వేడుకలకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా క్రీడ, సినీ, రాజకీయ రంగాలకు చెందిన 300 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని సానియా సన్నిహితులు తెలిపారు. దీంతో తాజ్ కృష్ణ హోటల్, సానియా ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తును పెంచారు.

ఇకపోతే... హైదరాబాద్ నగరానికి చెందిన యూనివర్సల్ బేకరీస్ యజమాని కుమారుడైన సొహ్రెబ్ మీర్జాతో సానియా మీర్జాకు పెళ్లి కాబోతుంది.

సానియామీర్జా ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Share this Story:

Follow Webdunia telugu