తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్: లాడ్జిలో సెక్స్ ర్యాకెట్!
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో గుట్కా ప్యాకెట్ బయటపడింది. గతంలో ఇదేవిధంగా లడ్డూలో బ్లేడ్లు, కత్తెర్లు కన్పించిన విషయం తెలిసిందే. అయినా తిరుమల అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. లడ్డూ తయారీ గిడ్డంగిలో పనిచేసే వారిని సోదా చేయకుండా పంపించడమే దీనికి ముఖ్య కారణం అని తెలుస్తుంది.మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరు పొందిన తిరుమలలో అపవిత్రమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పవిత్ర పుణ్యస్థలంలో వ్యభిచారానికి పాల్పడుతూ ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. ఈ నిందితుల్లో తిరుమల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదరం కుమారుడు సూరి ఒకడు కావడం గమనార్హం.కాంగ్రెస్ నేత తనయుడు సూరి, తిరుపతిలోని తిరుమలనగర్‌కు చెందిన ఢిల్లీతో కలిసి సప్తగిరి సత్రాల్లోని ఓ కాటేజీలో వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడ రైడింగ్ జరిపినప్పుడు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. అయితే మహిళలు మాత్రం అక్కడ నుంచి వెళ్లిపోయారు.