చంద్రబాబును తరిమి కొట్టాలి: గొట్టిపాటి రవికుమార్ పిలుపు
తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల ఏడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్ యాత్ర ఆరంభిస్తున్న నేపథ్యంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌కు వెళ్లి అనర్హత వేటుకు గురైన అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబును తెలంగాణలో అడుగుపెడితే తరిమి కొట్టాలని పిలుపు ఇస్తున్నారు.చంద్రబాబు తెలంగాణలో ఒక మాట సీమాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నారని గొట్టిపాటి విమర్శించారు. ఇప్పటికే ఒక దశలో గుంటూరు, కృష్ణా జిల్లాలలో పర్యటించిన చంద్రబాబు ప్రకాశం జిల్లా యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.