కావూరి సాంబశివరావు కారుపై కోడిగుడ్ల దాడి!
, మంగళవారం, 17 డిశెంబరు 2013 (13:17 IST)
కేంద్రమంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కోడిగుడ్ల సన్మానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద కావూరి కారుపై పలువురు సమైక్య ఉద్యమకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురు సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రతినిధిగా ఉంటున్న కావూరి సాంబశివ రావు వ్యక్తిగత ప్యాకేజీలు తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా నడుచుకుంటూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారంటూ సమైక్యవాదులు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.