మెదక్ జిల్లా కొల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డితోపాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న రోడ్డు మార్గం ద్వారా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.
రోడ్డుకు అడ్డంగా నడిచి వెళుతున్న గొఱ్ఱెల కాపరిని తప్పించే ప్రయత్నంలో ప్రతీక్ రెడ్డి అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. కారు అత్యంత వేగంతో ఢీకొట్టడంతో ప్రతీక్ రెడ్డితోపాటు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక కుమారుడు(ప్రతీక్ రెడ్డి) ఒక కుమార్తె ఉన్నారు. ప్రమాద వార్తను తెలుసుకున్న కోమటిరెడ్డి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.