అరసవల్లి పూజలు చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ!
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2012 (17:13 IST)
రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణ మద్యం ముడుపుల ఆరోపణల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు గ్రహాల అనుకూలత బాగా లేదని భావించి శ్రీకాకుళం జిల్లాలోని అరవవల్లి సూర్యదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కాగా అంతకుముందు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి అరసవిల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా అంతకుముందు మద్యం సిండికేట్లపై దాడులు జరిగినప్పుడు పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కూడా ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అయితే మొత్తానికి ఆపదలో ఉన్నప్పుడు మన రాజకీయ అధికార ప్రముఖులకు అరసవిల్లి సూర్యదేవుడు బాగానే గుర్తుకు వస్తున్నాడు.