Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మార్చుతా : పవన్ కళ్యాణ్

Advertiesment
pawan kalyan

ఠాగూర్

, మంగళవారం, 19 మార్చి 2024 (19:12 IST)
పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు.. పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 'నా గెలుపు కోసం మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం కూడా నాకు ముఖ్యమే. ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయి. తనను అసెంబ్లీకి పంపిస్తామనే హామీ చాలా మంది ఇచ్చారు. ఇకపై పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటా. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తా' అని పవన్‌ అన్నారు. 
 
ప్రజాగళం సభలో పోలీసుల తీరుపై అనుమానం... ఈసీకి ఫిర్యాదు చేస్తాం : నాదెండ్ల మనోహర్ 
 
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఆదివారం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్‌ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. నేతల సహకారంతో సభ విజయవంతంగా జరిగిందని తెలిపారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు.
 
'పవన్ కల్యాణ్ నాలుగేళ్ల కృషికి నిన్నటి సభతో ఫలితం వచ్చింది. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మూడు పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తుంది. వైకాపా అవినీతిని ప్రధాని నరేంద్ మోడీ ప్రజల ముందు ఉంచారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తాం. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సభలో చాలా ఇబ్బందులు వచ్చాయి. దీనిపై ఎన్నికల అధికారికి సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తాం' అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
 
బొప్పూడి ప్రజాగళం సభలో వైకాపాపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైకాపాను ఓడించాలనే కసితోనే ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. ప్రధాని సభకు సరైన భద్రత కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్కింగ్‌ ప్రదేశాలున్నా పోలీసుల వైఫల్యంతో ట్రాఫిక్‌ జామ్‌ అయిందన్నారు. 
 
పోలీసుల తీరును తప్పుబడుతూ ప్రజలకు ప్రధానే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సభలో భద్రతా వైఫల్యాలపై సీఈసీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వ దోపిడీ వల్ల ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారని ధూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోహపు షీట్లు నేలకూలడంతో మూడేళ్ల చిన్నారి మృతి