పంటలను నాశనం చేస్తున్న ఎలుకలపై మిజోరం రైతులు యుద్ధం ప్రకటించారు. రైతుల యుద్ధానికి మద్దతుగా ఎలుకలను మట్టుపెట్టిన వారికి పారితోషకాన్ని అందించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఎలుక తోక ఒక్కింటికి రెండు రూపాయలు ఇస్తామంటూ తాము ప్రవేశపెట్టిన పధకానికి రైతులు అనూహ్యంగా స్పందిస్తున్నారని పంట రక్షణ సహాయ అధికారి జేమ్స్ లాల్సియామ్లియానా తెలిపారు.
ఎలుకను మట్టుపెట్టినందుకు రుజువుగా ప్రజలు ఎలుక తోకను అందించవలసి ఉంటుందని వెల్లడించారు. రోజురోజుకు తమవద్దకు అత్యధిక సంఖ్యలో ఎలుక తోకలు చేరుకుంటున్నాయని జేమ్స్ అన్నారు.
ఎలుక తోకలు పునరావృతం కాకూడదనే ఉద్దేశ్శంతో అందిన ఎలుక తోకలకు పాత్రికేయుల సమక్షంలో దహనసంస్కారాలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా అందుకున్న ఎలుక తోకల గణాంకాలను ఆయన మీడియా ఎదుట ఉంచారు.
అజ్వాల్ జిల్లా - 11,106,
లుంగ్లైయ్ జిల్లా - 30,600,
కోలాసిబ్ - 10,000,
సెర్చిప్ - 10,500,
మామిట్ - 16,000
తాజా అంచనాలను అనుసరించి వరి పంట దిగుబడి 70 నుంచి 80 శాతం పడిపోయింది. ఇందులో ఎలుకల కారణంగా 80 శాతం, 20 శాతం పురుగుల మందు కారణంగా పడిపోయిందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు.