బాబా వంగా, ఈమె అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. ఆమెకు 12 ఏళ్ల వయసులో భయంకరమైమ టోర్నడో కారణంగా ఆమె చూపు శాశ్వతంగా పోయింది. ఐతే అప్పట్నుంచి ఆమెకి భవిష్యత్ చెప్పే శక్తి వచ్చిందట.
webdunia
విపత్తులు, వైపరీత్యాలు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఆమె ముందుగానే చెప్పేసేవారు.
భవిష్యత్ చెప్పిన ఆమెకి బల్గేరియా ప్రజలు బాబా వంగా అని బిరుదు ఇచ్చారు.
యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణుప్రమాదం ఇలా ఆమె చెప్పినవి ఎన్నో జరిగాయి.
ఆమె 1996లో కన్నుమూసే ముందుగానే 2021 సంవత్సరంలో విధ్వంసకర అనారోగ్య సమస్య వస్తుందని చెప్పారు.
రాబోయే 2023లో పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా జీవ ఆయుధాల శకం నెలకొంటుందని బాబా వంగా అన్నారు.
సహజ జననాల ముగింపు వుంటుందని, సౌర సునామీ తప్పదని ఆమె చెప్పారు.
2023లో భూ కక్ష్య మారుతుందని బాబా వంగా పేర్కొన్నారు.