ఏపీలో వారాహిపై పవన్ కళ్యాణ్ ప్రభంజనం త్వరలో...

తన పిల్లల భవిష్యత్‌ను తాకట్టుపెట్టి భావితరాల భవిష్యత్ కోసం పాటుపడుతున్నానని జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. భారత గణతంత్ర 74వ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాము.

credit: twitter

తన పిల్లల భవిష్యత్ గురించిన ఆలోచనను పక్కనబెట్టి భావితరాల భవిష్యత్ కోసం జనసేన ఆఫీసును నిర్మించానని చెప్పారు.

credit: twitter

తనకేమన్నా అయితే తన పిల్లలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో రూ.3 కోట్లు పిల్లలకి జమ చేసానన్నారు.

credit: twitter

అలా పిల్లల కోసం దాచిన రూ.3 కోట్లను పార్టీ నిర్మాణం కోసం, జనసేన బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టానని చెప్పారు.

credit: twitter

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోమారు విమర్శలు గుప్పించారు.

credit: twitter

అంతకుముందు రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంద్రకీలాద్రి కొండదిగువన వారాహి వాహనానికి పూజలు చేశారు.

credit: twitter

ఏపీ సుభిక్షంగా వుండాలని, కొత్త నాయకులు రావాలని ఆకాంక్షించారు.

credit: twitter

అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చాననీ, కొండగట్టులో వారాహికి పూజలు చేశామని అన్నారు.

credit: twitter

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి తాగితే...?

Follow Us on :-