కార్తీక మాసం పూర్ణిమ రోజు మంగళవారం రోజు మేషరాశిలో భరణి, నక్షత్రం మూడవ పాదములో రాహుగ్రస్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఉత్తర, తూర్పు ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.
webdunia
మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.
webdunia
ఈశాన్య రాష్ట్రాలలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.
webdunia
చంద్ర గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం 02 గంటలు 39 నిమిషాలు
webdunia
చంద్ర గ్రహణ మధ్యకాలం సాయంత్రం 04 గంటలు 29 నిమిషాలు
webdunia
చంద్ర గ్రహణ ముగింపు మోక్షకాలం సాయంత్రం 06 గంటలు 19 నిమిషాలు
webdunia
అద్యంతం పుణ్యకాలం 03 గంటల 40 నిమిషాలు
webdunia
గ్రహణ సమయంలో చంద్ర గాయత్రి మంత్రం ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్ స్మరించుకోవాలి.