ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగకూడదు, ఎందుకంటే?

కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి.

credit: Freepik

పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు.

నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

స్ట్రాబెర్రీలు, పైనాపిల్, అధిక నీటి శాతం ఉన్న ఇతర పండ్లు తిన్నాక నీటిని చాలా త్వరగా తీసుకుంటే ఇవి జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి.

పండ్లు తిన్న తర్వాత కనీసం 30-40 నిమిషాలు వేచి ఉండి నీరు తాగాలి.

చాలా ఎక్కువ నీటి శాతం ఉన్న పండ్లను తిన్నప్పుడు గంట వరకు వేచి వుండి మంచినీరు తాగవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

కూల్ డ్రింక్స్, సోడాలతో ఎంత అనారోగ్యమో తెలుసా?

Follow Us on :-