రక్తంలో అధిక చక్కెర స్థాయిలను పెంచే చెత్త పానీయాలు
మధుమేహం. ఈ వ్యాధిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నిశ్శబ్దంగా ప్రాణాలను హరించేస్తుంది. అందువల్ల డయాబెటిస్ పేషెంట్లు తాము తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ క్రింది పానీయాలను దూరంగా పెట్టేయాలి.
credit: social media and webdunia
చక్కెరతో నిండి వున్న సోడాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి బరువు పెరగడానికి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఎనర్జీ డ్రింక్స్ అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిగి ఉంటాయి కనుక వీటికి దూరంగా వుండాలి.
పండ్ల రసాలలో సహజ చక్కెరలు వుండటం వల్ల మొత్తం రక్తంలో చక్కెర నిర్వహణను మరింత దిగజార్చుతుంది.
మద్యపానం వల్ల అనూహ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటి జోలికి వెళ్లకూడదు.
ఐస్ క్రీమ్‌లను కలిగి ఉన్న కాఫీ పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.