ప్లమ్ ఫ్రూట్ లేదా ఆల్‌బుఖరా పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

ఆల్‌బుఖరా పండ్లు. ఈ పండ్లు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా వుండాలంటే ఈ పండ్లను తినాలి. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఉంటే ఆల్‌బుఖరా లేదా ప్లమ్ ఫ్రూట్స్ తినాలి.

ఆల్‌బుఖరా పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలం, ఫైబర్‌లో 4% వీటి ద్వారా లభిస్తుంది.

ఆల్‌బుఖరా పండ్లలో పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలకమైనది.

ఆల్‌బుఖరా పండ్లలో విటమిన్లు పుష్కలం, ఇందులో వున్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఆల్‌బుఖరా పండ్లలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాక ఎముకలను దృఢం చేస్తాయి.

ఆల్‌బుఖరా పండ్లు రోగనిరోధక కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

ఆల్‌బుఖరా పండ్లు తింటుంటే సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

Follow Us on :-