వెలగ పండును స్త్రీలు, పురుషులు ఎందుకు తినాలో తెలుసా?

వెలగ పండు. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. ఈ వెలగపండుతో శరీరానికి చేకూరే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: twitter

అల్సర్‌తో బాధపడే వారు వెలగ పండు తింటే ఉపశమనం కలుగుతుంది.

ఈ పండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికి మంచిది.

ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి.

అలసట, నీరసం ఆవహించినప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది.

మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లు ఈ పండ్లు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి.

స్త్రీలు ఈ పండు గుజ్జును తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది.

వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది.

ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

పచ్చి కొబ్బరి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

Follow Us on :-